తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 04 2023, 13:37

దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం మేలు చేసిందని బీఆర్ఎస్ అధినేతముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ ప్రశ్నించారు

అర్మూరులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడుతూ.. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని, రైతులకు 24 గంటల కరెంట్‌ అవసరం లేదని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలు పెంచుతున్నామని చెప్పారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్న కేసీఆర్‌.. ఆర్మూర్‌ నియోజకవర్గ అభ్యర్థి జీవన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 04 2023, 12:57

మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరికలు

 సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా ఆత్మకూరు మండలం పీపా నాయక్ తండ పరిధిలోని

కరోని తండాకు చెందిన ఉప సర్పంచ్ చంద్రు నాయక్, వార్డ్ మెంబర్లు యాదగిరి ,లింగ లతో పాటు 40 మంది బిజెపి కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి గులాబీ కండువా కప్పి మంత్రి జగదీష్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 03 2023, 18:41

గ్రామ గ్రామాన నీరాజనాలు పడుతు ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం కావాలని నలగొండ గడ్డపై గులాబీ జెండా ఎగరాలని ఆశిస్తున్న తిప్పర్తి మండల ప్రజలు

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ప్రచారంలో భాగంగా నేడు తిప్పర్తి మండలం యాపలగూడెం మామిడాల మరికొన్ని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు వారితో పాటు రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ....

రైతు గోస తెలిసిన నాయకుడు రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతుల పక్షపాతిగా నిలుస్తూ రైతుబంధు రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టి వ్యవసాయం దండగ అనే స్థాయి నుంచి వ్యవసాయం పండగల మార్చిన ఘనుడు కేసీఆర్ అని తెలిపారు

వికలాంగులకు వృద్ధులకు ఆసరా పించను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా బాసటగా నిలిచాడని తెలిపారు

ప్రజలందరూ ఈనెల 30న జరగబోయే ఎన్నికలలో తమ విలువైన ఓటును కారు గుర్తుపై వేసి కేసిఆర్ మూడోసారి సీఎంగా అసెంబ్లీకి పంపే బాధ్యత మన అందరిదని కోరారు

ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు సర్పంచులు వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు జిల్లా తిప్పర్తి మండల గ్రామ సాయి నాయకులు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 03 2023, 18:08

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం

ఎర్రవల్లిలోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది. తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్‌ అని ప్రశంసించారు. సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేసామని స్పష్టం చేసారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 02 2023, 22:01

ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని.. రాజకీయ పార్టీలు కాదని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థిని మాత్రమే కాకుండా అతడి వెనక ఉన్న పార్టీ గుణగణాలు, చరిత్ర చూసి బాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గారిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 02 2023, 21:25

ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి వ్యవసాయ క్షేత్రం వేదికగా చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం రెండో రోజూ కొనసాగుతోంది

యాగంలో ఈరోజు ప్రధానంగా రాజశ్యామల యంత్ర పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ దంపతులు స్వయంగా ఈ పూజలో పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు యాగ క్రతువును పర్యవేక్షిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 02 2023, 21:01

బీఆర్ఎస్ కు జై కొడుతున్న దివ్యాంగులు

బీఆర్ఎస్ ప్రభుత్వ హ్యాట్రిక్ ను కాంక్షిస్తూ ట్రై మోటార్ సైకిల్ పై ప్రచారం

 ప్రచారానికి శ్రీకారం చుట్టిన మేడ్చల్ జిల్లా శామీర్ పేట కు చెందిన మహేష్ అనే దివ్యాంగుడు

సూర్యాపేట కు చేరుకున్న ప్రచార యాత్ర

సూర్యాపేట పార్టీ కార్యాలయం లో జెండాఊపి ప్రచారయాత్ర ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 02 2023, 20:53

ప్రమాదవశాత్తు ఎమ్మెల్సీ గారి కాన్వాయ్ వాహనం తగిలి వ్యక్తికి గాయాలు

స్వయంగా హాస్పిటల్ కు తీసుకెళ్ళి వైద్య సహాయం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారు 

ములుగు నియోజకవర్గం బి అర్ ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తన ప్రచారానికి వెళుతుండగా, దామెర మండలం ఊరుగొండ వద్ద ఆ గ్రామానికి చెందిన దేవులపల్లి సాంబయ్య హటాత్తుగా రోడ్డు దాటే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఎమ్మెల్సీ కాన్వాయ్ లోని ఒక వాహనం తగిలి, స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే ఎమ్మెల్సీ స్వయంగా ఆ వ్యక్తిని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. సాంబయ్య కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులు భరించడం తో పాటు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో, సాంబయ్య కుటుంబం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 01 2023, 18:06

అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి

అభివృద్ధిని చూసి ఆశీర్వదిచండి,మీఆశీర్వాదమే మాకు కొండంత అండ అని రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మంత్రి జగదీష్ రెడ్డి గారికి హ్యాట్రిక్‌ విజయాన్ని అందించాలి’ అని ప్రజలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి,బీఆర్‌ఎస్‌ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేట పట్టణంలోని 14 వ వార్డు వినాయక నగర్, కృష్ణ కాలనీ లలో బుదవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు , సూర్యాపేట లో జరిగిన అభివృద్ధి ను వివరించారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మ్యానిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే సూర్యాపేట ను మెట్రో నగరానికి దీటుగా మంత్రి జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి చెయడం ఖాయం అన్నారు.సూర్యాపేట లో ఉన్న ప్రశాంత వాతావరణానికి తోడు పరుగులు పెడుతున్న అభివృద్ధి చూసే కార్పొరేట్ వ్యాపార సంస్థలు క్యూ కడుతున్నాయని అన్నారు. కాలి నడకన ఇంటికి ఇంటికి తిరిగిన సునిత జగదీష్ రెడ్డి బొట్టు పెడుతూ , మ్యానిఫెస్టో ను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Nov 01 2023, 17:59

ఘర్ వాపస్ అయిన వెంకటాపూర్ ఎంపీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామంజపూర్ వార్డు మెంబర్

కాంగ్రెస్ కి బిగ్ షాక్ మళ్ళీ తిరిగి సొంతగూటికి చేరిన వెంకటాపూర్ మండల ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య గార్లు వెంకటాపూర్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు రామాచారి రామంజపూర్ వార్డు మెంబర్ అనిల్

గౌరవ ఎమ్మెల్సీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ శ్రీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గులాబీ కండువా కప్పి తిరిగి పార్టీ లోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ప్రజలు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ వెంటే ఉంటారని బడే నాగజ్యోతికి ఆరునూరైనా ములుగు నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ఎమ్మెల్సీ గారు ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబు TSRDC చైర్మన్ ములుగు నియోజకవర్గ మూడు మండలాల ఎలక్షన్ ఇంచార్జ్  మెట్టు శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.